8 July, 2026 | 9:50 PM

ఏఐ రీమిక్స్ కొలేజ్ ఫీచర్లతో ఒప్పో రెనో 16 సిరీస్

08-07-2026 08:59 PM

హైదరాబాద్, జూలై 8 : 

ఒప్పో ఇండియా సంస్థ ఈరోజు రెనో 16 మరియు రెనో 16 సి మోడళ్లతో కూడిన రెనో 16 సిరీస్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవి భారతదేశపు మొట్టమొదటి హోలోవర్స్ 3D డిజైన్, 50MP 3.5× టెలిఫోటో లెన్స్‌తో కూడిన ఏఐ పోర్ట్రెయిట్ కెమెరా, నేచురల్ టోన్ ఇమేజింగ్ మరియు అన్ని ఫోకల్-లెంగ్త్ 4కే హెచ్ డీఆర్ వీడియో రికార్డింగ్ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

స్మార్ట్‌ఫోన్‌ను కేవలం సమాచార సాధనంగా మాత్రమే కాకుండా, అంతకు మించి భావించే యువత కోసం రూపొందించబడిన ఈ రెనో 16 సిరీస్, అద్భుతమైన కెమెరా, సృజనాత్మకతకు నిలయమైన స్టూడియో, పనులను సులభతరం చేసే భాగస్వామి మరియు వ్యక్తిగత సహాయకుడిగా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఏఐ రీమిక్స్ కొలేజ్, పాప్ క్యామ్ , పాపౌట్ 2.0 వంటి ఏఐ పవర్డ్ ఫీచర్లతో అద్భుతమైన కంటెంట్‌ను రూపొందించడం  స్మార్ట్ ఫీచర్లను ఉపయోగించడం నుంచి, ఈ రెనో 16 సిరీస్ వినియోగదారులు సులభంగా కొత్త కంటెంట్‌ను రూపొందించేందుకు, ఇతరులతో కనెక్ట్ కావడానికి, తమ ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరచడానికి తోడ్పడుతుంది..

ఈ లాంచ్ గురించి ఒప్పొ ఇండియా సంస్థ యొక్క పీఆర్ మరియు కమ్యూనికేషన్స్ హెడ్ గోల్డీ పట్నాయక్ మాట్లాడుతూ, "నేటి తరం యువతకు స్మార్ట్‌ఫోన్ అంటే కేవలం ఒక పరికరం కాదు. అది వారి సృజనాత్మకతకు చిరునామా, మధుర జ్ఞాపకాలను దాచుకునే చోటు, వారి వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చాటే మాధ్యమం. ట్రెండ్‌సెట్టింగ్ డిజైన్ మరియు సార్థకమైన ఆవిష్కరణల కలయికే రెనో సిరీస్. యువ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఇది ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది.రెనో 16 సిరీస్‌లో, ఆకట్టుకునే డిజైన్, అత్యుత్తమ కెమెరా అనుభవం మరియు దైనందిన పనులను సులభతరం చేసే ఏఐని ఒక అద్భుతమైన ప్యాకేజీగా అందిస్తున్నాము.

వినియోగదారులు తమ జీవితంలోని ప్రతి క్షణాన్ని మనస్ఫూర్తిగా బంధించడానికి, ఆత్మవిశ్వాసంతో తమను తాము ప్రదర్శించుకోవడానికి, మరియు ఒక ప్రీమియం అనుభూతిని ప్రతిరోజూ ఆస్వాదించడానికి, మేము ఎంతో ఆలోచించి దీన్ని రూపొందించామని తెలిపారు. ప్రతి రెనో తరం ఒక కొత్త డిజైన్ గుర్తింపును పరిచయం చేస్తుంది. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ రెనో సిరీస్ అత్యంత ధైర్యవంతమైన రూపంతో మన ముందుకు వచ్చింది. విశ్వంలోని అందం మరియు రహస్యాల నుండి ప్రేరణ పొందిన రెనో 16 సిరీస్, భారతదేశపు మొట్టమొదటి హోలోవర్స్ త్రీడీ డిజైన్‌ను పరిచయం చేస్తోంది. ఒప్పో ప్లానెట్ డిజైన్‌తో కలిపి, ఏ కోణం నుండి చూసినా అద్భుతంగా కనిపించేలా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించారు.