7 August, 2026 | 12:29 PM

వర్షం పడుతున్నా.. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల ఆందోళన

07-08-2026 11:43 AM

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. జూలై 20న CJP నిరసనకారులపై జరిగిన పోలీసు చర్య, అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలకు సంబంధించి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు(Opposition MPs protest) పార్లమెంటులోని 'మకర్ ద్వార్' వద్ద నిరసన చేపట్టారు. వర్షం పడుతున్నా విపక్ష సభ్యులు వెనక్కి తగ్గేదే లే అంటూ పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. విద్యార్థులపై దాడులకు అమిత్ షా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. అమిత్ షా సభకు ఎందుకు రావడంలేదని ప్రశ్నించారు.అమిత్ కనిపించడంలేదంటూ విపక్ష సభ్యులు ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు.