7 August, 2026 | 12:29 PM

ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు

07-08-2026 11:31 AM

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ నేతలు(Telangana BJP Leaders) ఢిల్లీకి వెళ్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తో(BJP National President Nitin Nabin) టీ బీజేపీ నేతలు సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. హస్తినకు వెళ్తున్న వారిలో టీబీజేపీ చీఫ్ రామచందర్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై జాతీయ అధ్యక్షుడితో నేతలు చర్చించనున్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్ ఇంట్లో 2 రోజుల పాటు కీలక అంశాలపై చర్చించారు. అటు నేతల మధ్య సమన్వయంపై హైకమాండ్ దృష్టి సారించింది.