7 August, 2026 | 12:29 PM

కోహెడలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

07-08-2026 11:46 AM

కోహెడ, ఆగస్టు 6,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని(National Handloom Day) పురస్కరించుకొని.. పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి, సమాజానికి విశిష్ట సేవలందించిన కొండబత్తిని రాజలింగం, ఆకుబత్తిని భూమయ్య, నక్క సత్తయ్య లను శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం మండలాధ్యక్షుడు గొరిట్యాల లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదాసు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి నరాల శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు కొండబత్తిని సతీష్, కోశాధికారి రమేష్, సభ్యులు ప్రశాంత్, శంకర్, ప్రసాద్, రామకృష్ణ, సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.