ఒరాకిల్‌లో మరోసారి ఉద్యోగాల కోత
15-09-2026 | 09:04am
ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్(Oracle) మరోసారి ఉద్యోగాల కోతకు దిగింది. సోమవారం ఉదయం కొందరు ఉద్యోగులకు ఈ-మెయిల్స్ పంపి, అదే రోజు తమ చివరి పనిదినమని సంస్థ ప్రకటించింది. సంస్థాగత మార్పుల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తాజా లేఆఫ్‌లలో ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయారనే విషయాన్ని ఒరాకిల్ వెల్లడించలేదు. అయితే 2026 ఆర్థిక సంవత్సరంలో సుమారు 21 వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై భారీ పెట్టుబడులు పెడుతున్న సమయంలో ఈ కోతలు చోటుచేసుకోవడం గమనార్హం.