18 April, 2026 | 9:24 PM

Breaking News

కర్ దవాఖానలో ఆర్గాన్ రాకెట్?

20-08-2024 03:11 AM
  1. వైద్యురాలి హత్య కేసులో కొత్త కోణాలు 
  2. కీలకంగా మారిన మాజీ ప్రిన్సిపాల్ 

కోల్‌కతా, ఆగస్టు 19: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న వైద్యురాలి అత్యాచారం, హత్య కేసులో కొత్త కోణాలు బయటకొస్తున్నాయి. ముఖ్యంగా ఆర్జీ కర్ దవాఖాన, దాని మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు అర్హత లేకున్నా ఆ పదవి కట్టబెట్టారని, అదే అలుసుగా తీసుకొన్న ఆయన దవాఖానలో ఏకంగా అవయవాల విక్రయ రాకెట్‌కు తెరలేపారని విమర్శలు వస్తున్నాయి. ఆయన ఎంత చెప్తే అంత అన్నట్టుగా ఉండేదని చెప్తున్నారు. 

ఘోష్‌పై లోతుగా దర్యాప్తు

ఈ కేసులో కీలకంగా మారిన మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పైనే సీబీఐ ప్రధానంగా దృష్టి పెట్టింది. నాలుగురోజులుగా ఆయనను సీబీఐ ప్రశ్నిస్తున్నది. అయితే, ఆయన చెప్తున్న విషయాల్లో చాలావాటికి పొంతన కుదరటం లేదని తెలిసింది. డాక్టర్ చనిపోయిన విషయం ఆమె తల్లిదండ్రులకు ఎవరు ఫోన్ చేసి చెప్పారు?

మృతురాలిది ఆత్మహత్య అని ఎవరు నిర్ధారించారు? పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే ఆత్మహత్య అని ఎందుకు నిర్ధారణకు వచ్చారు. ఘటన జరిగిన మూడో అంతస్తులో ఆగమేఘాల మీద రెనోవేషన్ పనులకు ఎవరు ఆదేశాలిచ్చారు? హత్య జరిగిన సమయంలో ప్రిన్సిపాల్ ఎక్కడ ఉన్నారు? అని సంధించిన ప్రశ్నలకు సందీప్ సూటిగా సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్లు సమాచారం.  

బాధితురాలి డైరీలో పేజీ మాయం

ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి డైరీలో ఒక పేజీ చించివేసి ఉండటాన్ని దర్యాప్తు అధి కారు లు గుర్తించారు. ఇప్పుడు ఆ పేజీ ఏమైంది? అందులో ఆమె ఏం రా సుకున్నారు? అనే విషయాలను తె లుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. దవాఖానలో ఆమె ఏమైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను గుర్తించారా? అందువల్లనే హత్యకు గుర య్యారా? అనే కోణంలోనూ దర్యా ప్తు జరుపుతున్నారు. హత్య జరిగిన 9వ తేదీన తాను అక్కడ లేనని మా జీ ప్రిన్సిపాల్ పోలీసులకు వాగ్మూ లం ఇచ్చారు.  

కశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్

సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ మృతి

శ్రీనగర్, ఆగస్టు 19: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యలు కొన సాగుతూనే ఉన్నాయి. సోమవారం జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయాడు. ఉధంపూర్ జిల్లాలో సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తున్న ఒక ఇన్‌స్పెక్టర్ ఉగ్రవాదుల మెరుపు దాడిలో ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు ప్రకటించారు. వెంటనే తేరుకొన్న బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. చనిపోయిన అధికారి సీఆర్పీఎఫ్ 187 బెటాలియన్‌కు చెందినవారని అధికార వర్గాలు వెల్లడించాయి.