13 March, 2026 | 2:40 AM

ఉస్మానియా వర్శిటీ తెలంగాణకు ఐకాన్

14-03-2026 12:00 AM
  1. రూ. వెయ్యి కోట్లతో అభివృద్ధికి రూట్ మ్యాప్
  2. నిధులు మంజూరు చేయడం అభినందనీయం
  3. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు
  4. నీటి పారుదల శాఖ -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఐకాన్‌గా నిలిచిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి విశ్వవిద్యాల యం మన రాష్ట్రంలో ఉండడం మనకెంతో గర్వకారణమని ఆయన చెప్పారు. అంతటి పేరెన్నికగన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని తాను కాంక్షిస్తున్నానని తెలిపారు. గురువారం ఉ స్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ వి భాగంలో ఆయన నిర్మాణ్ సాంకేతిక సదస్సును ప్రారంభించారు.

ఈ సందర్భం గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ 1917లో స్థాపించిన ఈ విశ్వవిద్యాల యం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. అందుకు కొనసాగింపుగా 1929లో విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రారంభం అయిన ఇంజినీరింగ్ కళాశాల యావత్ భారతదేశంలోనే అత్యంత ప్రాశస్త్యమైన కళాశాలలలో ఆరవ స్థానంలో నిలిచిం దని ఆయన చెప్పారు. అంతటి ప్రఖ్యాతి గాం చిన విశ్వవిద్యాలయం అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించడమే కా కుండా సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా రూ. వెయ్యి కోట్లు నిధులు మంజూరు చేయడం అభినందనీయమని ప్రశంసించారు.

విశ్వవిద్యాలయంలో అవసరమైన అధ్యాపకుల భర్తీ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.  ఇక్కడి నుంచి ఎం తో మేధో సంపద ఉత్పత్తి అయిందని, ఆ మేధస్సు ప్రపంచ స్థాయిలో అభివృద్ధికి దో హద పడుతుందన్నారు. సిలికాన్ వ్యాలీలో పనిచేస్తున్న మెజారిటీ ఇంజినీర్లు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండే ఎదిగిన వా రు అని, అంతే గాకుండా గల్లీ నుండి ఢిల్లీ స్థాయికి ఎదిగిన నేతలు, క్రీడాకారులు, ఉన్నత పదవులు చేపట్టిన వారి అడుగులు ఇక్కడి నుంచే మొదలు అయ్యాయని గుర్తు చేశారు.

అటువంటి విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్ర ఉద్యమంలో అగ్రభాగాన నిలు చోవడమే కాకుండా విద్యార్థులు చేసిన త్యాగాలు ఇక్కడ ప్రస్తావనర్హమే అని భావిస్తున్నానని చెప్పారు. నిర్మాణ్ వంటి సాం కేతిక సదస్సులు విద్యార్థులకు పరిశోధన, సృజనాత్మక తాను పెంపొందించే వేదికలని ఆయన చెప్పారు. మన నిర్మాణాలు కేవలము కట్టడాలకే పరిమితము కాకుండా ప్రజల జీవితాలలో వెలుగులు నింపేందుకు దోహద పడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్బోధించారు.