27 June, 2026 | 2:21 PM

Breaking News

అతిథి ఉపాధ్యాయుల కోసం దరఖాస్తులు చేసుకోండి   •   రెండు చుక్కలే..చిన్నారుల భవిష్యత్‌ కు రక్షణ!   •   మల్లేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం అక్రమాలపై 11 మందిపై కేసు నమోదు   •   ఎమ్మార్వోగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర గ్రూప్-1 ప్రథమ ర్యాంకర్   •   ప్రమాదానికి మద్యం మత్తే కారణం   •   షాద్‌నగర్ ఆర్డీవో కార్యాలయంలో "ఎమ్మెల్యే" ఆకస్మిక తనిఖీ   •   సత్తుపల్లి మున్సిపాలిటీ 19వ వార్డు – తుమ్మూరి రామారావు వీధిలో ప్రజల దుస్థితి.   •   ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. రైతన్నల కళ్లలో ఆనందం   •   జ్యువెలరీ షోరూమ్‌లో రౌడీల వీరంగం   •   ప్రజల భవిష్యత్తును నిర్ణయించేది ఓటే: కమటం వెంకటేశ్వరరావు   •  

ఇల్లందు గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా కార్యదర్శి

27-06-2026 01:29 PM

ఇల్లందు టౌన్, జూన్ 27 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కే. కరుణకుమారి శనివారం ఇల్లందు శాఖా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న రికార్డులు, పుస్తకాల నిర్వహణ, పాఠకులకు అందిస్తున్న సేవలు, కార్యాలయ నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రంథాలయ నిర్వహణ సక్రమంగా ఉండటంతో పాటు సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసి, ఇదే విధంగా సేవలను కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సిబ్బంది డి. రుక్మిణి పాల్గొన్నారు.