జర్మన్ భాషా శిక్షణ ద్వారా విదేశీ ఉపాధి అవకాశాలు
మంత్రి వివేక్ వెంకటస్వామి
మంచిర్యాల, జూన్ 10 (విజయక్రాంతి): నిరుద్యోగ యువతీ, యువకులకు జర్మన్ భాష శిక్షణ ఇప్పించడం ద్వారా విదేశీ ఉపా ధి అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.
బుధవారం టాస్క్ ఆధ్వ ర్యంలో జిల్లాలోని మందమర్రి పట్టణంలోని ఇల్లందు క్లబ్ లో ఏర్పాటు చేసిన జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, టాస్క్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, టామ్ కామ్ మేనేజర్ నాగ భారతిలతో కలిసి మంత్రి మాట్లాడారు. మీ ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని, పట్టుదల ఉన్న వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా అనేక ఉపాధి అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా జర్మనీలో నైపుణ్యం కలిగిన యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. జర్మనీలో న ర్సింగ్, సాంకేతిక, పారిశ్రామిక రంగాలలో ల క్షలాది ఉద్యోగాలలో ఖాళీలు ఉన్నాయని, తెలంగాణ యువత అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ ద్వారా జ ర్మన్ భాషా శిక్షణ అందిస్తుందన్నారు. ఉ ద్యోగం ఎక్కడ లభిస్తే అక్కడికి వెళ్లి పని చేసే దృక్పథం యువతలో అలవర్చుకోవాలన్నా రు.
తాను పారిశ్రామికవేత్తగా పని చేసిన అ నుభవాన్ని ప్రస్తావిస్తూ మార్కెట్ ఉన్న ప్రాం తాలలో పరిశ్రమలు స్థాపించడం వల్ల వేలా ది మందికి ఉపాధి కల్పించగలిగామన్నారు. స్థానికతకే పరిమితం కాకుండా అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్లాలని యువతకు సూచించారు. జర్మనీలో వారానికి కేవలం 32 నుంచి 35 గంటల పని సమయం మాత్రమే ఉంటుందని, మిగతా సమయంలో ఇతర నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని, జర్మనీలో నెలకు 2 లక్షల 50 వేల రూపాయలు, ఆపై న ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ప్రైవేట్ ఏజెన్సీల మోసాల కు గురి కాకుండా ప్రభుత్వ సంస్థ అయిన టాస్క్ ద్వారా శిక్షణ పొంది విదేశీ ఉద్యోగాలను పొందాలని, ఇప్పటికే ఈ కార్యక్రమానికి 112 మంది యువత నమోదు చేసుకున్నారని, వారందరికీ నైపుణ్యాభివృద్ధి శిక్ష ణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పించడం బాధ్యతగా తీసుకుంటామన్నారు. ప్ర భుత్వం టామ్ కామ్ సంస్థకు 90 కోట్ల రూ పాయలు అందించి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన స్డ్ టెక్నాలజీ సెంటర్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు నెలకు 2 వేల రూపాయల స్టైఫండ్ అందిస్తోందని, అదే విధంగా జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న అభ్యర్థులలో 80 శాతం హాజరు నమోదు చేసుకున్న వారికి కాకా వెంకటస్వామి ట్రస్ట్ తరఫున అదనంగా నెలకు వెయ్యి రూపాయల స్టైఫండ్ అందిస్తామని తెలిపారు. యువతలో క్రమశిక్షణ, ప ట్టుదల, లక్ష్యసాధనపై దృష్టి ఉండాలని, జ ర్మన్ భాషను నేర్చుకోవడానికి ప్రతిరోజూ సాధన చేయాలని సూచించారు.
మందమర్రిలో ప్రారంభ మైన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపేందుకు ప్రతి వారం తా ను స్వయంగా శిక్షణ కేంద్రాన్ని సందర్శించి అభ్యర్థులతో కలిసి జర్మన్ భాషను నేర్చుకుంటానని తెలిపారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని కోరారు. అంతకు ముందుక్లబ్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జర్మన్ భాషా శిక్షణలో బీటూ సర్టిఫికేషన్ పూర్తి చేసిన మరియన్ పాసల్, హుబా ఫాతిమా లకు ఆఫర్ లెటర్లు అందజేశారు.






