28 July, 2026 | 1:11 PM

Breaking News

మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •  

నాగోబాను దర్శించుకున్న శిక్షణ ఐఏఎస్ అధికారులు

11-06-2026 02:18 AM

ఇంద్రవెల్లి అమరవీరులకు అధికారుల నివాళ్లు

ఉట్నూర్, జూన్ 10 (విజయక్రాంతి): ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబాను 2025 శిక్షణ ఐఏఎస్ అధికారులు దర్శించుకున్నారు. శిక్షణలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న శిక్షణ ఐపీఎస్ అధికారులు బుధవారం నాగోబా ను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అధికారులను ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనందరావు ఆదివాసి సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికి, శాలులతో సన్మానించి నాగోబా దేవుడి ప్రసాదాన్ని అందించారు. నాగోబా దేవుడి చరిత్ర, నాగోబా జాతర సందర్భంగా ఆదివాసుల చేపట్టే పూజా విధానంపై ఐఏఎస్ అధికారులు ఆలయ పీఠాధిపతిని అడిగి తెలుసుకున్నారు. 

ఇంద్రవెల్లి అమరులకు నివాళులు

జిల్లాలో పర్యటిస్తున్న 2025 శిక్షణ ఐఏఎస్ అధికారులు హరి ప్రసాద్, సాయి సురేష్, సాయి శివాని, శ్రీకాంత్ రెడ్డి, సచిన్ బసవరాం గుప్తా, పరస్ కుమార్ తదితరులు ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం ను సందర్శించారు. ఈ సందర్భంగా గిరిజన అమరవీరులకు ఘనంగ నివాళులర్పించారు. ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న జరిగిన సంఘటన వివరాలను ఆదివాసీ నాయకుడు మెస్రం నాగనాథ్ ను అడిగి తెలుసుకున్నారు.

1981లో జరిగిన సంఘటన నుండి సీఎం రేవంత్ రెడ్డి స్మారక సూపం వద్ద ఏర్పాటు చేసిన పార్క్ వరకు అధికారులకు వివరించారు. అధికారుల వెంట ఐటీడీఏ ఏపీవో ( జనరల్) వసంతరావు జాదవ్, ఏపీఓ పిటిజి ఆత్రం భాస్కర్, ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగం ఈ.ఈ తానాజీ జాదవ్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఐటిడి అధికారులు పాల్గొన్నారు.