24 August, 2026 | 11:43 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

సర్వేంద్రియానాం... నయనం ప్రధానం

26-06-2026 07:03 PM

ఉచిత కంటి... వైద్య శిబిరానికి విశేష స్పందన

జవహర్ నగర్,(విజయక్రాంతి): సర్వేంద్రియానామ్ నయనం ప్రధానమని, సర్వ ఇంద్రియాలకు నయనాలే అనగా కండ్లే ప్రధానమైన అవయవాలని, జవహర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పాపయ్య నగర్ లో  విన్ విజన్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఎస్ అండ్ ఎస్ ఫౌండేషన్ సహకారంతో బాలవికాస సేవా సంస్థ భాగస్వామ్యంతో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ ప్రజలు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం ఈ శిబిరంలో దాదాపు 100 మంది రోగులకు ఉచిత కంటి పరీక్షలు చేయించుకొని వైద్యుల నుండి అవసరమైన సలహాలు సూచనలు పొందారు. ఈ కార్యక్రమంలో బాలవికాస సేవా సంస్థ కోఆర్డినేటర్లు ఇన్నారెడ్డి, వినోద్ రెడ్డి, ఎస్ అండ్ ఎస్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.