కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యునిగా పి.శ్రీనివాస్ రెడ్డి నియామకం
తూప్రాన్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యునిగా నియమితులైన తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి పట్లోరి శ్రీనివాస్ రెడ్డి కి హృదయ శుభాకాంక్షలను తెలిపిన బిజెపి నేతలు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాకిచ్చిన ఈ పదవి నా సొంత పనికి కాకుండా పార్టీ కోసం శక్తివంచన లేకుండా అహర్నిశలు కృషి చేస్తానని తూప్రాన్ మండలం అధ్యక్షులు పిట్ల పోచయ్యతో కలిసి పార్టీకి పనిచేస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇందులో జిల్లా జనరల్ సెక్రటరీ నత్తి మల్లేష్ ముదిరాజ్, తూప్రాన్ రూరల్ అధ్యక్షులు పిట్ల పోచయ్య, మున్సిపల్ అధ్యక్షులు జానకి రామ్ గౌడ్, శక్తికేంద్రం ఇంచార్జ్ కుంట రాజు, జనరల్ సెక్రటరీ సందీప్, మనోహరాబాద్ జనరల్ సెక్రటరీ మల్లేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు నీరుడి యాదగిరి, తదితరులు ఉన్నారు.






