22 August, 2026 | 10:21 PM

ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందాలి

22-08-2026 09:31 PM

- బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం, మెరుగైన సౌకర్యాలు అందించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా జనరల్ ఆసుపత్రిని సందర్శించారు. వైద్యులు, వైద్య విద్యార్థులు, రోగులతో మాట్లాడి వైద్య సేవలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధ్యతతో పనిచేస్తూ ప్రతి రోగికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.