calender_icon.png 20 July, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఏడీ.. ఓ సైలెంట్ కిల్లర్

20-07-2025 12:09:21 AM

పెరిఫెరల్ ఆర్టరియల్ వ్యాధి (పీఏడీ) అనేది ఇంకా ప్రమాదకరంగా గుర్తించబడని రక్తప్రసరణ సంబంధిత అనారోగ్య పరిస్థితి. ఈ వ్యాధి అవయవాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఈ  వ్యాధి తమకు  ఉన్నట్లు చాలామందికి  తెలియదు.

పీఏడీ, ధమనులు,  కాళ్లలో కొవ్వు ఫలకా లు సంకుచితం చెందినపుడు ఏర్పడుతుంది. ఈ ప్రక్రియను అథెరోస్క్లెరోసిస్ అని అంటా రు. ఇది ఎటువంటి హెచ్చరిక లేకుండా వినాశకరమైన పరిణామాలకు దారి తీస్తుంది.

‘పెరిఫెరల్ ఆర్టరియల్ వ్యాధి కాళ్ల నొప్పి కంటే ఎక్కువ. ఇది తీవ్రమైన హృదయ సంబంధ సమస్యలకు ఒక హెచ్చరిక అని డాక్టర్ అపూర్వ అంటున్నారు. 

పీఏడీతో గుండెపోటు, పక్షవాతం వచ్చే ప్ర మాదం గణనీయంగా ఉంటుంది. కాబట్టి ప్రారంభ రోగ నిర్ధారణ, చికిత్స చాలా కీలకం. దీని ముఖ్య లక్షణం ఇంటర్మిటెంట్ క్లాడికేషన్. నడిచేటప్పుడు పిక్కలు లేదా తొడలలో నొప్పి, తిమ్మిరి రావడం, విశ్రాంతి తీసుకుంటే తగ్గడం. ఈ లక్షణాన్ని చాలామంది అలసట లేదా కీళ్ల నొప్పు ల కారణంగా పట్టించుకోరు. ముదిరిన దశలో కాలి వేళ్లు, పాదాలలో నల్లగా రంగు మారడం కనిపిస్తుంది. దీనిని గ్యాంగ్రీన్ అని అంటారు. ఇది కాలి వేళ్లు, అవయవాలను కోల్పోయేలా చేస్తుంది. 

ఇతర హెచ్చరిక సంకేతాలు

v పాదాలు లేదా కాళ్లపై చల్లని, నిగనిగలాడే లేదా నీలిరంగు చర్మం

v మానని పుండ్లు లేదా అల్సర్లు

పీఏడీ యొక్క  ప్రమాద కారకాలు 

అధిక రక్తపోటు, మధుమేహం, వృద్ధాప్యం, అధిక రక్త కొలెస్ట్రాల్ స్థాయిలు,  పొగాకు వినియోగం.

కలర్ డాప్లర్‌తో వ్యాధి నిర్ధారణ

వ్యాధిని ముందుగా గుర్తించడం అనేది   కీలకం. వ్యాధిని యాంకిల్ బ్రాకియల్ ఇండెక్స్ (ఏబీఐ), కలర్ డాప్లర్ పరీక్ష వంటి పరీక్షల ద్వారా నిర్థారిస్తారు. వ్యాధి దశ ఆధారంగా చికిత్స వర్గీకరించి మందులతో తగ్గిస్తారు. 

ప్రమాదాన్ని తగ్గించుకోవడం కోసం

v ధూమపానం మానేయడం

v బీపీ, మధుమేహాన్ని నియంత్రించడం

v కొలెస్ట్రాల్ తగ్గించే చికిత్సలు

v స్టాటిన్లు, యాంటీప్లేట్లెట్ ఏజెంట్లు

 వ్యాధి ముదిరితే రీవాస్కులరైజేషన్

విశ్రాంతి సమయంలో నొప్పి మరియు గ్యాంగ్రీన్ ఉంటే యాంజియోప్లాస్టీ/స్టెంటింగ్ లేదా బైపాస్ సర్జరీలు వంటి రీవాస్కులరైజేషన్ ప్రక్రియలు అవసరం. శారీరక శ్రమ లేక పోవడం, ఊబకాయం, అధిక కొవ్వు పదార్థా లు తినడం,  ధూమపానం వంటి ప్రస్తుత జీవనశైలి మార్పుల కారణంగా ఈ వ్యాధి చాలా చిన్న వయస్సు వారిలో కూడా కనిపిస్తుంది.

వ్యాధి బారిన పడకుండా ఉండడానికి..

v ధూమపానం మానేయండి

v ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి

v చురుకుగా ఉండండి

v సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోండి

పెరిఫెరల్ వాస్కులర్ వ్యాధి ఒక తీవ్రమైన ఇంకా నిర్వహించదగిన పరిస్థితి. ఎంత త్వరగా గుర్తిస్తే, అంతమంచి ఫలితాలు ఉంటాయి. కాళ్ల నొప్పి, తిమ్మిరి, లేదా నెమ్మదిగా మానే పుండ్లను నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్యకరమైన ప్రసరణ ఆరోగ్యకరమైన జీవితానికి కీలకం కాబట్టి, స్టార్ హాస్పిటల్, హైదరాబాద్‌లో డాక్టర్ అపూర్వతో మీ సంప్రదింపులను బుక్ చేసుకోండి.

-  డాక్టర్ వి. అపూర్వ

కన్సల్‌టెంట్ వాస్క్యూలర్, 

ఎండో వాస్క్యూలర్ సర్జరీ

స్టార్ హాస్పిటల్స్

హైదరాబాద్