20 April, 2026 | 10:43 PM

టీపీటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలి

20-04-2026 09:35 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ఉద్యోగ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 30న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ జిల్లా నాయకులు దబ్బేటి యాదగిరి కోరారు. సోమవారం మండల కేంద్రం అర్వపల్లి లోని పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్ లో మండల విద్యాధికారి బాలునాయక్, తహసీల్దార్ శ్రీకాంత్ లతో కలిసి విద్యా సదస్సు వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ మండల అధ్యక్షుడు పూసపల్లి మల్లయ్య, సంఘం నాయకులు రాజుల భిక్షం, వడ్లకొండ యాదగిరి, వరదాచార్యులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.