20 April, 2026 | 11:14 PM

అనాఘపురి కాలనీలో అన్ని సమస్యలే

20-04-2026 10:03 PM

సమస్యలపై అధికారులకు వినతి

మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ పరిధిలోని అనాఘపురి కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాలనీలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం డిప్యూటీ కమిషనర్‌కు వినతి పత్రం సమర్పించారు. కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి పైపులైన్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, వీటి వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. 

ఇప్పటికైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు దాచపల్లి నాగరాజు, ప్రధాన కార్యదర్శి రావుల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి ఆకుల సదాశివ గుప్త ఉపాధ్యక్షుడు ఏనుగు సంజీవరెడ్డి, సలహాదారుడు గొట్టిముక్కల వెంకటరెడ్డి, సత్యనారాయణ, కొమ్మ బాబు, ఇతర సభ్యులు పాల్గొన్నారు.