19 April, 2026 | 6:16 PM

మామిడిపెల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం

19-04-2026 04:44 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం మామిడిపెల్లి గ్రామంలో ఐకేపీ, ప్యాక్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు తమ ధాన్యానికి సరైన ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు మధ్యవర్తుల సమస్యలు లేకుండా తమ ధాన్యాన్ని నేరుగా విక్రయించుకునే అవకాశం కలుగుతుందని, దీంతో వారికి ఆర్థికంగా లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.