16 August, 2026 | 12:23 PM

కలుషిత నీరు తాగి మేకల మృతి

16-08-2026 12:08 PM

మణుగూరు, ఆగష్టు 16,( విజయ క్రాంతి న్యూస్): మండలంలోని సమితి సింగారం  గ్రామానికి చెందిన రాచకొండ రాములు 19 మేకలు మృతి చెందాయి. బాధితుడు తెలిపిన వివరాలు ప్రకారం.. మణుగూరు ఓసి టు చెక్ పోస్ట్ వద్ద ఉన్న బ్లాస్టింగ్ సెక్షన్ కార్యాలయం నుండి వచ్చే వాగులో నీరు తాగి మరణించినట్లు ఆరోపించారు. మేకల  జీవనాధారంగా పెంచుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నానని వాపోయారు. మేకల మృతి చెందడంతో తీవ్రంగా నష్టపోయాయని ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.