16 July, 2026 | 12:19 PM

పద్మశ్రీ అవార్డు గ్రహీత రామచంద్రయ్య కన్నుమూత

23-06-2024 10:29 PM

భదాద్రి కొత్తగూడెం: పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిన రామచంద్రయ్య( 65) అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఉపరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన భదాద్రి కొత్తగూడెం జిల్లా మణిగూరులో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆదివాసి దేవతలైన  సమక్క, సారలమ్మ జీవిత చరిత్రను కంచు మేళంతో ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన రామచంద్రయ్యకు కేంద్ర ప్రభుత్వం 2022లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.