డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు... పట్టుబడ్డ 385 మంది మందుబాబులు
23-06-2024 10:15 PM
హైదరాబాద్ : వీకెండ్ వచ్చిందంటే చాలు.. రాత్రంగా ఫుల్‌గా మద్యం సేవించి రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు కొందరు మందుబాబులు. ఈ క్రమంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన డ్రంకన్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 385 మంది మందుబాబులు పట్టుబడ్డారు. వారి నుంచి 292 ద్విచక్ర వాహనాలు, 80 కార్లు, 11 ఆటోలు, 2 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఐటీ కారిడర్‌లోనే అత్యధికంగా 182 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన మందుబాబులను కోర్టులో హాజరు పరచనున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే మద్యం సేవించి ప్రమాదాలకు కారణమైతే వారిపై చట్టపరంగా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, ప్రమాద తీవ్రతను బట్టి సుమారు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.






