16 July, 2026 | 12:06 PM

విద్యాసంస్థల్లో సీట్లు తెలంగాణకే పరిమితం చేయాలి

23-06-2024 10:36 PM

హైదరాబాద్: విద్యాసంస్థల్లోని సీట్లు తెలంగాణకే పరిమితం చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టానికి జూన్ 2తో కాలం చెల్లిందని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆయన తెలిపారు. విభజన చట్టం పదో షెడ్యూల్‌లో ఉన్న విద్యాసంస్థలు.. తెలుగు, డా.బీఆర్ అంబేద్కర్ వంటి విశ్వవిద్యాలయాలను ఉమ్మడి జాబితా నుంచి తొలగించాలని పేర్కొన్నారు. అదేవిధంగా హైదరాబాద్ విద్యాసంస్థల్లో సీట్ల కేటాయింపు  తెలంగాణ వారికే పరిమితం చేయాలని తెలిపారు. దీనికి సంబంధించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ సీఎంఓ, సీఎస్‌కు ట్వీట్‌ను ఆయన ట్యాగ్ చేశారు.