18 April, 2026 | 3:55 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ

01-06-2025 06:36 PM

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మంద కృష్ణ మాదిగ ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అందుకున్నారు. ఈ నేపథ్యంలో మంద కృష్ణ తమ ఆనందాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. సామాజిక న్యాయం కోసం మంద కృష్ణ మాదిగ చేస్తున్న కృషిని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మరోసారి ప్రశంసించారు.