30 June, 2026 | 11:58 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

10-04-2026 03:12 PM

పాక్ అసలు రంగు బయటపడింది

ఇజ్రాయెల్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం

ఇస్లామాబాద్: ఇజ్రాయెల్, పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ను నాశనం చేయాలని పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్(Pakistan's Defence Minister Khawaja Asif)  సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ మంత్రి వ్యాఖ్యలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్ ను క్యాన్సర్ దేశంగా పేర్కొన్నారు. లెబనాన్ లో ఇజ్రాయెల్ నరమేధం సృష్టిస్తోందని ఖవాజా ఆరోపించారు.

పాక్ మంత్రి ఖవాజా వ్యాఖ్యలు ఏ మాత్రం సహించరానివని ఇజ్రాయెల్ మండిపడింది. శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం పేరుతో ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని ఇజ్రాయెల్ చురకలంటించింది. ఖవాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ అసలు రంగు బయటపడిందని ఇజ్రాయెల్ తెలిపింది. పాక్ తటస్థ మధ్యవర్తిగా ఉండగలదా అని ఇజ్రాయెల్ సందేహం వ్యక్తం చేసింది. ఉగ్రవాదుల నుంచి తమ దేశాన్ని రక్షించుకుంటామని ఇజ్రాయెల్ తెల్చిచెప్పింది.