30 June, 2026 | 10:57 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

మోనాలిసా మైనర్

11-04-2026 12:00 AM
  1. తప్పుడు పత్రాలు సృష్టించి పెళ్లి
  2. భర్త ఫర్మాన్‌పై పోక్సో కేసు

భోపాల్, ఏప్రిల్ 10: మహాకుంభమేళాలో తళుక్కుమన్న మోనాలిసాను పెళ్లి చేసుకున్న ఫర్మాన్ చిక్కుల్లో పడ్డాడు. మైనర్‌ను వివాహం చేసుకున్నాడని అతనిపై పోక్సో, బీఎన్‌ఎస్, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. పోలీసుల విచారణలో మోనాలిసా మైనర్ అని నిర్ధారించారు. జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ నిర్వహించిన విచారణలో మోనాలిసా వయసుపై స్పష్టత వచ్చింది.

ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం ఆమె 2009 డిసెంబర్ 30న జన్మించింది. ఈ ఏడాది మార్చి 11న వివాహం జరిగే సమయానికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ల 2 నెలల 12 రోజులు మాత్రమే. ఆమెను మేజర్‌గా చూపి స్తూ తప్పుడు జనన ధృవీకరణ పత్రాలను సృష్టించినట్లు అధికారులు గుర్తించారు. ఫర్మాన్ వివాహం కేరళలోని నైనార్ దేవాలయంలో జరిగింది. ఆధార్ కార్డులో ఉన్న వయస్సు ఆధారంగా పెళ్లి జరిపించామని ఆలయ నిర్వాహకులు తెలిపా రు.

నకిలీ బర్త్ సర్టిఫికేట్ ద్వారా పంచాయితీలో వివాహ రిజిస్ట్రేషన్ కూడా చేయించి నట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఆ సర్టిఫికెట్‌ను వెంటనే రద్దు చేయాలని ఎస్సీ కమి షన్ ఆదేశించింది. కాగా ఈ వివాహం ము మ్మాటికీ ‘లవ్ జిహాద్’ అని ఉద్దేశ్యపూర్వకంగానే ఫర్మాన్ ట్రాప్‌లోకి దింపి పెళ్లి చేసుకున్నాడనే ఆరోపణలున్నాయి.