27 July, 2026 | 9:54 AM

ఈసారి మమతకు మద్దతు

30-05-2024 12:02 AM

ఇప్పటికే రాహుల్,  కేజ్రీకి మద్దతిచ్చిన ఫవాద్

తాజాగా మమతను పొగిడిన పాకిస్థాన్ నేత

న్యూఢిల్లీ, మే 29: భారత ప్రతిపక్ష నేతలకు పాకిస్థాన్ నుంచి మద్దతు లభిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెడుతున్న వేళ పొరుగు దేశం నుంచి మరోసారి అలాంటి ప్రకటనే వచ్చింది. ఈసారి పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీపై పాక్ నేత ప్రశంసలు కురిపిం చారు. మంగళవారం ఓ ఇంటర్వ్యూలో పాక్ నేత ఫవాద్ చౌదరి భారత్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీ ఓడిపోవాలని ప్రతి పాకిస్థానీ కోరుకొంటున్నాడని చెప్పా రు. ‘ఈ ఎన్నికల్లో నరేంద్రమోదీ ఓటమి తప్పనిసరి. ఇండియా, పాకిస్థాన్‌లో వేర్పాటువాదాన్ని ఓడిస్తేనే రెండు దేశాలు దగ్గరవుతాయి. రెండుదేశాల్లో ఒకరిపై ఒకరికి ద్వేషం లేదు. కానీ, బీజేపీ సిద్ధాంతం పాకిస్థాన్ పట్ల ద్వేషాన్ని ఎగదోస్తున్నది. భారత ఓటర్లు మూర్ఖులు కాదు. భారత్ ప్రగతిశీల దేశంగా ముం దుకు సాగాలి. రాహుల్‌గాంధీ కావచ్చు.. కేజ్రీవాల్ కావచ్చు.. మమతాబెనర్జీ కావ చ్చు.. మోదీని ఎవరు ఓడించినా వారికి అభినందనలు’ అన్నారు. ఈయనే గతంలో రాహుల్, కేజ్రీవాల్‌ను పొగిడారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ అంశాన్ని ఎన్నికల అస్త్రంగా ఉపయోగిస్తున్నారు.