నీటిని వృథా చేస్తే రూ.2 వేలు జరిమానా
30-05-2024 12:05 AM
ఢిల్లీ జల బోర్డు నిర్ణయం
న్యూఢిల్లీ, మే 29: నీటి ఎద్దడి నేపథ్యంలో దేశ రాజధానిలో ఎవరైనా నీటిని వృథా చేస్తే జరిమానా విధిస్తామని ఢిల్లీ జల బోర్డు (డీజేబీ) బుధ వారం ప్రకటించింది. వాటర్ ట్యాంక్ లు పొంగే వరకు మోటర్లు ఆన్ చేసి ఉంచినా, గృహాలకు సరఫరా అయ్యే నీటితో కార్లు శుభ్రం చేసినా, కట్టడాల నిర్మాణాలకు వినియోగించినా తక్షణం 2 వేలు జరిమానా చెల్లించాలని పేర్కొంది. తనిఖీలకు 200 బృందాలు ఏర్పాటు చేశామని, అవి రంగంలోకి దిగుతాయని తెలిపింది. ‘ఢిల్లీ పౌరులు నీటిని పొదుపు గా వాడుతూ ప్రభుత్వానికి సహకరించాలి. ఎవరైనా నీటిని వృథాచేస్తున్నట్లు నిర్ధారణ అయినా, గృహావసరాలకు సరఫరా చేసే నీటిని నిర్మాణ పనులకు వినియోగించినా జరిమానా విధిస్తాం’ అని ఢిల్లీ మంత్రి అతిషీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.






