24 March, 2026 | 2:53 AM

పాకిస్థాన్ వస్తే లేపేస్తాం

24-03-2026 01:24 AM

విదేశీ ప్లేయర్స్‌కు బెదిరింపులు

పాక్ ఉగ్రవాద సంస్థ హెచ్చరిక

పీఎస్‌ఎల్ జరగడంపై డౌటే

లాహోర్, మార్చి 23 : పాకిస్థాన్ సూపర్ లీగ్‌కు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. ఆఫ్ఘనిస్థాన్‌తో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఇప్ప టికే పీఎస్‌ఎల్‌ను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అటు పలువురు విదేశీ ఆటగాళ్లు పాక్ వచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు. పీఎస్‌ఎల్ ఆడదామనుకుంటున్న కొద్దిమంది విదేశీ ప్లేయర్స్‌కు సైతం బెదిరింపులు మొదలయ్యాయి.

పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడేందుకు రావొద్దంటూ ఉగ్రవాస సంస్థలు హెచ్చరించాయి. తాజా గా పాకిస్తాన్‌లో ఉన్న జమాత్ ఉల్ అహ్రార్ అనే తీవ్రవాద సంస్థ విదేశీ ప్లేయర్లకు బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు డేవిడ్ వార్నర్ , స్టీవ్ స్మిత్తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్‌ను టార్గెట్ చేస్తూ ఓ లేఖ విడుదల చేసింది. పీఎస్‌ఎల్ టోర్నీలో ఆడేందుకు రావొద్దని ఒకవే ళ తమ మాటలు పట్టించుకోకుండా పాల్గొం టే వారి ప్రాణాలకు తాము హామీ ఇవ్వలేమంటూ బెదిరింపులకు దిగింది.

దీనికి సం బంధించి ఆయా ఆటగాళ్ల క్రికెట్ బోర్డులకు సైతం సూచనలు చేసింది. తాము క్రికెట్ బోర్డులకు స్పష్టంగా చెబుతున్నామని, ప్లేయర్స్‌ను పంపొద్దని హెచ్చరించింది. పాక్ ఉగ్రవాదుల సంస్థలు క్రికెటర్లకు ఇలా ఓపెన్ వార్నింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి. ప్రస్తుత పరిస్థితుల్లో పీఎస్‌ఎల్ నిర్వహించొద్దని అక్కడ ఉన్న ఉగ్రవాదసంస్థలు పలుమార్లు హెచ్చరించాయి. అయినప్పటకీ పాక్ క్రికెట్ బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాకుం టే లీగ్ షెడ్యూల్ పలు మార్పులు చేశారు.

పశ్చిమాసియాలో యుద్ధపరిస్థితుల కారణంగా ఇంధన లోటును దృష్టిలో ఉంచుకు ని లీగ్ ను రెండు నగరాలకే పరిమితం చేశారు. అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లో పీఎస్‌ఎల్ నిర్వహిస్తామని పీసీబీ ఛైర్మన్ నక్వీ ప్రకటించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఉగ్రవాదులు విదేశీ ప్లేయర్స్‌ను టార్గెట్ చేశారు. మ్యాచ్‌లను అడ్డుకుంటామని, అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ లేఖ విడుదల చేశాయి. ఇప్పటికే పలువురు విదేశీ ప్లేయర్స్ పీఎస్‌ఎల్ ఒప్పందాలను రద్దు చేసుకుని ఐపీఎల్‌లో ఆడేందుకు నిర్ణయించుకున్నారు.