పాక్‌ది దుష్ప్రచారం
- మహిళలపై జాతి విధ్వంసక సామూహిక లైంగికదాడి ప్రచారంపై భారత్ మండిపాటు
- ప్రపంచం దృష్టిని మరల్చేందుకే తమపై నిందారోపణలు
- మహిళల హక్కులను కాలరాయడంలో పాకిస్తాన్‌కు దారుణమైన రికార్డు
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్చలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్
న్యూ ఢిల్లీ : మహిళల హక్కులను కాలరాయడంలో పాకిస్థాన్‌కు దారుణమైన రికా ర్డులు ఉన్నాయని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి చర్చలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ విమర్శించారు. కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసకు గురయ్యారని, ఇస్లామాబాద్ ఫోరమ్లో కశ్మీరీ మహిళల ‘దుస్థితి’ని హైలెట్ చేసేందుకు పాక్ అధికారిణి సౌమా సలీమ్ ప్రయత్నించగా.. హరీష్ దీటుగా తిప్పికొట్టారు.
పాకి స్థాన్ సొంత పౌరులపైనే బాంబుల వర్షం కురిపిస్తూ మారణహోమానికి పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి దృష్టికి తెచ్చారు. దా యాది చేస్తున్నవన్నీ దుష్ప్రచారాలని, ప్ర పంచం దృష్టిని మరల్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ప్రతిసారి తమదేశంపై చేస్తున్న ఆరోపణలను హరీష్ ఈ సందర్భంగా తప్పుబట్టారు. మహిళలు, శాంతిభద్రతల అజెండాలో తమ మార్గదర్శకాలు సరిగానే ఉన్నాయని పేర్కొన్నారు.
ఆపరేషన్ సెర్చ్‌లైట్ ప్రస్థావన
తూర్పు పాకిస్థాన్‌లో బెంగాలీలను అణచివేచివేసేందుకు 1971లో పాక్ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సెర్చ్‌లైట్ గురించి హరీష్ ప్రస్తావించారు. అప్పట్లో పాక్ సైన్యం లక్షల మంది మహిళలను నిర్బంధించి దారుణంగా హింసించారని తెలిపారు. వారిపై సామూహిక అత్యాచారానికి పాక్ తన సైన్యానికి అనుమతించిందని ఆరోపించారు. కానీ,ఆ దేశం చేసే దుష్ప్రచారాలను నమ్ముతూ.. ప్రపంచం మొత్తం ఈ విషయాలను చూస్తూ ఉండిపోయిందని అసహనం వ్యక్తం చేశారు.
అయితే, ఇప్పుడు కూడా పాక్ తన వక్రబుద్ధిని బయటపెట్టిందని, మహిళలపై జరిగిన జాతి విధ్వంసక సామూహిక లైంగికదాడిపై తమ దేశంపైనే నిందారోపణలు చేస్తోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ తన భ్రాంతికరమైన దుష్ప్రచారాలను, ముఖ్యం గా జమ్మూ అండ్ కశ్మీరుకు సంబంధించి ఇంకా కొనసాగిస్తోందని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.




