అఫ్గాన్‌పై పాక్ యుద్ధం
ఇరుదేశాల సరిహద్దుల వద్ద హోరాహోరీ
133 మంది అఫ్గాని ప్రజలు మృతిచెందారని మీడియాలో కథనాలు
మూడు తాలిబన్ల కార్యాలయాలు సైతం ధ్వంసం
పాక్ ఎఫ్ యుద్ధ విమానాన్ని కూల్చేసిన తాలిబన్ సైన్యం
ఇస్లామాబాద్/ కాబూల్, ఫిబ్రవరి ౨౭: పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీశాయి. రెండు దేశాల బలగాల మధ్య భీకర పోరు సాగుతోంది. పాక్ ‘ఆపరేషన్ గజబ్ లిల్ హక్’ పేరిట శుక్రవారం తెల్లవారుజామున అఫ్గానిస్థాన్‌లోని కాబూల్, కాందహార్, ఫక్తియా నగరాలపై పాక్ వైమానిక దాడులు చేసింది. దాడుల్లో ౧౩౩ మంది అఫ్గాని ప్రజలు మృతిచెందారని అంతర్జాతీయ మీడి యా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి.
ఇవే దాడుల్లో రెండు తాలిబన్ల బ్రిగేడ్ ప్రధాన కార్యాలయాలు, ఒక కోర్ ప్రధాన కార్యాలయంతోపాటు పలుచోట్ల భవనాలు సైతం ధ్వంసమయ్యాయి. పాక్ సైన్యం ప్రధానంగా మందుగుండు సామగ్రి నిల్వలు, లాజిస్టిక్ కేంద్రాలనే టార్గెట్ చేసింది. మరోవైపు, అఫ్గానిస్థాన్‌పై తాము బహిరంగ యుద్ధం(ఓపెన్ వార్) చేస్తున్నట్లు ప్రకటిస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అధికారికంగా వెల్లడించారు.
యుద్ధ పరిణామాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా స్పందించారు. అఫ్గాన్ బలగాలను దురాక్రమణదారులు అని అభివర్ణించారు. అఫ్గాన్ ప్రజలను నల్లుల్లా నలిపేస్తామని హెచ్చరించారు. తమ దేశ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. డ్యూరాండ్ రేఖను అఫ్గాన్ ప్రభుత్వం గుర్తించడం లేదని పాక్ కొంతకాలం నుంచి మండిపడుతున్నది. తాజా వైమానిక దాడులతో ఈ వివాదం యుద్ధంగా రూపాంతరం చెందింది.
అఫ్గాన్ ప్రతిఘటన
పాక్ దాడులను తాలిబన్ తీవ్రంగా తిప్పికొట్టింది. ఆ సరిహద్దుల్లోని 19 పాక్ సైనిక అవుట్ పోస్టులను స్వాధీనం చేసుకుంది. అఫ్గాన్ సైన్యం దాడుల్లో 55 మంది పాక్ సైనికులు మరణించారు. మరికొందరు బందీలుగా పట్టుబడ్డారు. అఫ్గాన్ గగనతలంలోకి వచ్చిన పాక్‌ఎఫ్ యుద్ధ విమానా న్ని కూల్చివేసినట్లు తాలిబన్ ప్రకటించింది. ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది. అఫ్గాన్ ప్రయోగించిన డ్రోన్లు పాకిస్థాన్‌లోని అబోటాబాద్ వంటి సుదూర ప్రాంతాల వరకు వెళ్లి దాడులు చేయడం గమనార్హం.
పాకిస్థాన్ వద్ద అణ్వయుధాలు ఉండటమనే అంశం ఇతర దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. యుద్ధంపై ఐక్యరాజ్య సమితి స్పందిస్తూ.. రెండు దేశాలు తక్షణం యుద్ధం నిలిపివేయాలని విజ్ఞప్తి చేసింది. చైనా, భారత్ అఫ్గనీస్థాన్‌కు మద్దతకు ప్రకటించాయి. రష్యా, బ్రిటన్ రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని కోరుకుంటున్నట్లు ప్రకటించాయి. మరోవైపు, రెండు దేశాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు సౌదీ అరేబియా, ఖతార్ దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
ఇరుదేశాల భిన్న వాదనలు
రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల ప్రాణనష్టంపై రెండు దేశాలు వేర్వేరు గణాంకాల ను వెల్లడిస్తున్నాయి. తమ దాడు ల్లో 274 మంది అఫ్గానీలు మరణించినట్లు పాక్ ప్రకటించగా, అఫ్గాన్ 13 మందే మరణించారని చెబుతోంది. పాక్‌సైన్యంలో 55 మందిచని పోయినట్లు అఫ్గాన్ ప్రకటించగా, ఇద్దరు సైనికులే మరణించారని పాక్ పేర్కొంది.




