04-12-2025 12:04:49 AM
మూడు పార్టీల్లో అదే తీరు
సమన్వయంపై దృష్టి పెట్టిన అగ్రనేతలు
నిర్మల్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సారిగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను అన్ని పార్టీలు సవాల్గా స్వీ కరించాయి. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న సర్పంచ్ ఎన్నికల తేదీలను ప్రక టించి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో మూడు పార్టీలో తమ మద్దతుదారులు సర్పంచ్ ఎన్నికలకు సై అంటూ నామినే షన్లు దాఖలు చేయడంతో జిల్లా నేతలకు తలనొప్పిగా మారుతుంది.
పార్టీలు ఏవైనా పం చాయతీ ఎన్నికల్లో తమ వారిని గెలిపించుకోవాలని పార్టీ అధిష్టానం ఆదేశించిన క్షేత్ర స్థాయిలో మాత్రం పార్టీ మద్దతు దారులు పో ట పోటీగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు సాంకేతాలు ఇవ్వడంతో ఇప్పుడు సమన్వయంపై చర్చ జరుగుతుంది. నిర్మల్ జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా 400 గ్రామపంచాయతీలకు 3,368 వార్డు సభ్యులకు ఈనెల 11 మొదటి విడత 14న రెండో విడత 17న మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరిగి ఫలితాలు రానున్నాయి.
జిల్లాలో నిర్మల్ ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గం ఉండగా అన్ని నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్ బిజెపి పార్టీలో పనిచేసిన కార్యకర్తలు నేతలు రెండు మూడు వర్గాలుగా విడిపోయి సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికి వారే యమునా తీరు అనే రీతిగా వివరిస్తున్నారు. ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
పార్టీ రహిత ఎన్నికలు అయినప్పటికీ పార్టీ మద్దతు ధరలను ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యతను పార్టీ అధిష్టానం జిల్లా కమిటీ నియోజకవర్గ కమిటీ మండల కమిటీల పై పెట్టింది. ప్రస్తుతం ఖానాపూర్ కు సెట్టింగ్ ఎమ్మెల్యే బెడుమ బొజ్జు పటేల్ ప్రాతినిథ్యం వహిస్తుండగా నిర్మల్‌లో బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముధోల్ లో అక్కడ ఎమ్మెల్యే రామారావు పటేల్ తమతమ నియోజకవర్గం లో తమ అనుచరులను గెలిపించుకునే బాధ్యతను చేపట్టారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రె స్లో గ్రూపు విభేదాలు ఉన్నాయి.
నిర్మల్ లో డిసిసి అధ్యక్షులు శ్రీ ఆర్ రావు మాజీ మంత్రి ఇంద్రకన్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర పోటి నడుస్తుంది. ముధోల్‌లో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ తాజా మాజీ ఎమ్మె ల్యే విట్టల్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్చారి అనుచరులు కూడా సర్పంచ్ ఎన్నిక ల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగంలో దిగారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రేఖ శ్యాం నాయక్ అనుచరులు తమకు ప్రాధాన్యత ఇవ్వాలని అక్కడ ఎమ్మెల్యే పై ఒత్తిడి తెస్తున్నారు
ప్రతిపక్ష పార్టీలో అదే పరిస్థితి
నిర్మల్ జిల్లాలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన టిఆర్‌ఎస్ బిజెపి పార్టీలో సర్పంచ్ ఎన్నికల వేడి కాక పుట్టిస్తుంది. బిజెపిలో పాత కొత్త తరం నేతల మధ్య వైరం ఏర్పడి ఆయా గ్రామాల్లో రెండు గ్రూపుల మధ్య మద్దతుదారులు తమ నామినేషన్లను దాఖలు చేశారు ముధోల్ నియోజ కవర్గం ఎమ్మెల్యే రామారావు పటేల్ ఆయన సోదరుడు మోహన్ పటేల్ పాత సీనియర్ నాయకులు పార్టీ వెంట నడిచిన కార్యకర్తలకు మద్దతుగా ఉంటామని చెప్పడంతో కొత్త పాత నాయకుల మధ్య వైరం ఏర్పడుతుంది.
ఖానాపూర్ నియోజకవర్గంలో ఆ పార్టీ నాయకులు రిజిస్ట్రేషన్ రాథోడ్ అశోక్ల మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. మూడు నియోజకవర్గాల్లో ఆయా గ్రామాల్లో హిందుత్వక వాదం కోసం తాము పోటీలో ఉన్నామని తమకే మద్దతు ఇవ్వాలని నాయకుల మధ్య మొరపెట్టుకుంటున్నారు. ఇక బిఆర్‌ఎస్ లో అంతగా పోటీ లేనప్పటికీ గ్రామాల్లో పలుకుబడి ఉన్న టిఆర్‌ఎస్ నేతలు సర్పంచ్ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఏకతాటిపై వచ్చి కొట్లాడు ఎందుకు సిద్ధంగా ఉన్నారు
ఎన్నికలకు ముందే పంచాయతీ..
నిర్మల్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు ముందే జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక పంచాయతీ ఏర్పడుతుంది. నిర్మల్ ఖానాపూర్ ముధోల్ నియోజకవర్గాల్లో మూడు పార్టీలో పనిచేసిన కార్యకర్తలు పాతా కొత్త నాయకులు పార్టీ గుర్తు గుర్తు రహిత ఎన్నికల కావడంతో ఎన్నికల బరిలో నిలబడి గెలిస్తే లీడర్లు ఆప్ కూడా చేర్చుకుంటారని ఉద్దేశంతో తమతమ మద్దతుదారు లతో నామినేషన్లను వేసి ప్రజా బలాన్ని రాజకీయపరకుబడి రాజకీయ నేపథ్యం ప్రజాసేవ తదితర అంశాలను ముఖ్య నేతల దృష్టికి తీసుకువచ్చి తమకు మద్దతు ఇవ్వాలని పట్టుబడు తున్నారు.
అన్ని పార్టీలు ఒకే పార్టీ నుంచి ఇద్ద రు నుంచి ముగ్గురు పోటీ చేయడంతో నేతలు వారిని సమన్వయం చేసేందుకు పిలిపించుకొని బుజ్జగింపులు చేపడుతున్నారు. ఇప్పటికీ ఆయా పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్చార్జిలు మండల కమిటీ బాధ్యతలు ముఖ్యమైన అగ్రనేతలు ఆయా ప్రాంతాల్లో తమ అనుచరులతో ఫోన్లో మాట్లాడి అక్కడి రాజకీయ సమీకరణలను వేర్ ఇస్ వేసుకొని రాజీ కుదిరిచే మార్గాన్ని చేపడుతున్న కొన్ని ప్రాంతాల్లో అవి బెడిసి కొడుతున్నాయి.
డిసిసి అధ్యక్షులు వెడుమ బుజ్జి పటేల్ ఆ పార్టీ అగ్రనేతలు ఇంద్రకరణ్ రెడ్డి వేణుగోపాలచారి నారాయణరావు పటేల్ విట్టల్ రెడ్డి శ్రీహరి రావు గ్రంథాలయ చైర్మన్ తదితరులు కాంగ్రెస్లో నేతల పంచాయతీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
బిజెపిలో సెట్టింగ్ ఎమ్మెల్యే తో పాటు సీనియర్ నేతలు పార్టీలో నెలకొన్న గందర గోళానికి తీరదించేందుకు రంగంలో దిగారు బీఆర్‌ఎస్ లో అంత పోటీ లేనప్పటికీ ఇద్దరు అభ్యర్థులు ఉంటే రాజీ మార్గాన్ని కుదిరిచి సర్పంచ్ గా ఒకరు ఎంపీటీసీగా ఒకరు పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు రామకృష్ణారెడ్డి లోలం శ్యాంసుందర్ రమాదేవి కిరణ్ కారే వంటి నేతలు క్షేత్రశాల పర్యటించి పార్టీని ప్రతిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ నేతలు తీసుకున్న నిర్ణయాలను పార్టీ కార్యకర్తలు ఏ మేరకు అమలు చేస్తారో నామినేషన్ల ఉపసంహరణ తర్వాత తేలనుంది.