04-12-2025 12:05:39 AM
సీఈవోకు టీఎస్‌టీసీఈఏ విజ్ఞప్తి
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాం తి): గ్రామపంచాయతీ ఎన్నికలు ఈనెల 11, 14, 17వ తేదీల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో కాలేజీలకు సెలవులు ప్రకటించాలని, పరీక్షలను వాయిదా వేయాలని టీఎస్‌టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సీఈవోకు ఆయన బుధవారం వినతిపత్రం సమ ర్పించారు. పోలింగ్ రోజుల్లో జేఎన్టీయూ, ఓయూ పరిధిలోని కళాశాలలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని, అయితే పరీక్షలకు హాజ రయ్యే విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోని వారే ఎక్కువగా ఉండడంతో వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలని కోరారు.