30 June, 2026 | 11:57 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఏ అబేదా బసీర్, మస్జీద్ ఏ అలీ మస్జిద్ లను సందర్శించిన డిప్యూటీ మేయర్

10-03-2026 08:00 PM

మహబూబ్ నగర్ టౌన్: 11వ డివిజన్ బండమీదిపల్లి ప్రాంతంలోని పాలమూరు యూనివర్సిటీ సమీపంలోని  మస్జీద్ ఏ అబేదా బసీర్,మస్జీద్ ఏ అలీ మస్జిద్ లను మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మస్జిద్ లకు సంబంధించిన విద్యుత్, రోడ్లు, నీటి సమస్యలను పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఆ డివిజన్‌లోని ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, వాటిని త్వరగా పరిష్కరించేలా అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మస్జీద్ పెద్దలు, మస్జీద్ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు  ప్రజలు పాల్గొన్నారు.