పాపాన్ని, ప్రసాదును వెంటనే అరెస్టు చేయాలి

17-09-2026 | 12:13pm

ఇంద్రవెల్లిలో ఆయన చిత్రపటాలను దగ్ధం చేసిన దళిత సంఘాలు

ఉట్నూర్, సెప్టెంబర్ 17( విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్(B.R. Ambedkar)ను అవమానపరుస్తూ  పుస్తకం రాసిన పాపాని ప్రసాద్ పై వెంటనే కేసు నమోదు చేసి  అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు  డిమాండ్ చేశారు. గురువారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడంతో పాటు  ఆయన చిత్రపటాలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  మెమోరియల్ మండల శాఖ  అధ్యక్షుడు  సోన్ కంబ్లె జితేందర్, దళిత సంఘాల నాయకులతోపాటు  ఇంద్రవెల్లి పంచాయతీ ఉప సర్పంచ్  సుమిత్ తిట్టే  తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తలు