30 April, 2026 | 2:49 AM

పది ఫలితాల్లో పారడైజ్‌కు రాష్ట్రస్థాయి మార్కులు

30-04-2026 01:36 AM

కరీంనగర్, ఏప్రిల్ 29(విజయక్రాంతి): బుధవారం వెలువడిన ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో రేకుర్తిలోని పారడైజ్ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించినట్లు పాఠశాల చైర్మన్ డాక్టర్ పి ఫాతిమారెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు వి.సాయిప్రేమ్ షిఫా తమన్నా 586, వి.అశ్వని 584, బి.సాహితి 584, బి.సుధీష్ణ 579, బి.లక్ష్మీప్రసన్న 578, ఎన్.స్ఫూర్తిరెడ్డి 574, బి.నక్షత్ర 574, సానియా 573, బి.జిషిత 570, ఎస్.శ్రీదేవి 570 మొదలైన విద్యార్థులు రాష్ట్ర స్థాయి మా ర్కులు సాధించినట్లు పాఠశాల చైర్మన్ డాక్టర్ ఫాతిమారెడ్డి తెలిపారు. పాఠశాలలో బుధవారం ప్రత్యేక కార్యక్ర మం నిర్వహించి ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ డాక్టర్ పి.ఫాతిమారెడ్డి, ప్రిన్సిపాల్ టి.వసంత, వైస్ ప్రిన్సిపాల్ ఏ.మధు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థి నీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.