calender_icon.png 19 January, 2026 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ పోరుకు పార్టీల నజర్..!

19-01-2026 12:00:00 AM

  1. ఉద్యమాల గుమ్మం ఖమ్మం  నుండే పోరుకు సన్నద్ధం  

అభివృద్ధి పనులతో ప్రచారంకు సీఎం శంఖారావం  

శతాబ్ది సంబరాల సభతో పాగాకు సీపీఐ వ్యూహం

ప్రభుత్వ వ్యతిరేకతపైనే బీఆర్‌ఎస్ ఆశలు

హస్తం పార్టీని ఢీకొట్టేందుకు విపక్షాల వ్యూహాలు 

కూటమి దిశగా బీఆర్‌ఎస్,సీపీఎం, సీపీఐ అడుగులు?

సీపీఐ, కాంగ్రెస్ మధ్య స్నేహమా, సమరమా..?

గెలుపు అజెండానే ప్రధాన పార్టీల లక్ష్యం    

భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 18 (విజయక్రాంతి) : రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పట్టు సాధించి, తమ పార్టీల ఆదిపత్యానికి తిరుగులేదని నిరూపించుకో నేందుక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మున్సిపల్ పోరుకు సన్నద్ధమ వుతున్నాయి. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో పాగా వేసేందుకు తమదైన వ్యుహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

మెజారిటీ స్థానాల్లో గెలిచి పైచేయి సాధించాలని అధికార, విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే పల్లెలపై పట్టు సాధించిన అధికార కాంగ్రెస్, పట్టణాల్లోనూ గెలిచి తన సత్తా చాటాలనుకుంటోంది. ఇటు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అది తమకు కలిసివస్తుంద న్న భావనలో విపక్ష పార్టీలలో ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో ఓటర్లే తమకు ప్రధాన బలమని, కచ్చితంగా పురపోరులో తమ సత్తా చూపిస్తామని వామపక్ష నేతలు  అంటున్నారు. మొత్తంగా పట్టణ ప్రాంత ఓటర్లను తమ వైపునకు తిప్పు కొనేందుకు ప్రధాన పార్టీలన్నీ కుస్తీలు పడుతున్నాయి.

అయితే కార్పొరేషన్లు, మునిసి పాలిటీలను హస్తగతం చేసుకునేందుకు అధికార పార్టీ బహుముఖ వ్యుహంతో బరిలోకి దిగింది. సీఎం రేవంత్రెడ్డి  జిల్లా పర్యటనతో  కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్స వాలను చేసి ఖమ్మం నుండి మున్సిపల్ ఎన్నికల సమర శంఖాన్ని పూరించారు. మరోవైపు సిపిఐ పార్టీ కూడా ఖమ్మం నుండే పోరుకు సన్నద్ధమవుతుంది. శతాబ్ది సంబరాల సభతో పాగాకు సిపిఐ వ్యూ హంకు పదును పెడుతుంది. మున్సిపల్ సమరంపై విజయక్రాంతి కథనం.

 స్నేహమా.. సమరమా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీపీఐ  కలిసి పోటీ చేశాయి. సీపీఐకి ఒక సీటు కేటాయించగా, కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి వారి మధ్య సహృద్భావ వాతావరణంలో ఉన్న పొత్తు గత పంచాయతీ ఎన్నికలలో విభేదాలు పొడచూపాయి. సర్పంచ్ ఎన్నికలో కాంగ్రె స్కు సహకారం అందించిన తమకు ఉప సర్పంచ్ పదవులను  ఇవ్వకుండా మోసం చేశారని సీపీఐ శ్రేణులు చెబుతున్నాయి.

కొత్తగూడెం, పాల్వంచ రెండు మున్సిపాలి టీలను కలిపి కార్పొరేషన్ గా ఏర్పాటు చేశారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈ కార్పొరేషన్ మేయర్ పదవిని తమకు కేటాయించాలని, అత్యధిక డివిజన్ లు తమ కే కేటాయించాలని సీపీఐ డిమాండ్ చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కు సహకరిస్తున్నందున.. ఇక్కడైనా తమకు సహకరించాలని విన్నవిస్తున్నది.

కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎమ్మెల్యేగా సీపీఐ ఉన్నందున.. స్థానిక సంస్థ ల్లో కాంగ్రెస్ అవకాశం కల్పిస్తే  ఇక్కడి స్థానిక నాయకులకు గుర్తింపు, దక్కుతుందని వాదిస్తున్నారు. ఇరు పార్టీల మధ్య  పొత్తు కొనసాగుతుందా,లేదా ఎవరికి వారు పోటీ చేస్తారా అనేది తేలాల్సి ఉన్న ది. 

ప్రత్యేక వ్యూహంతో కాంగ్రెస్ ..

ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో 60 శాతానికి పైగా స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ అదే ఊపుతో పట్టణాల్లోనూ పాగా వేయాలని భావిస్తుంది. ముఖ్య మంత్రి రేవంత్ సభతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.  సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ప్రచార బాధ్యతలు చేపట్టడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తు తోనే జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ అన్ని మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది.

అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార విధానం వరకు ప్రతిఅంశం పై పార్టీ అంతర్గతంగా విస్తృత చర్చలు జరుపుతోంది. ప్రతి మున్సి పాలిటీలో కాంగ్రెస్ను గెలిపించే బాధ్యతను ముఖ్య నేతలకు అప్పగించనున్నారు.

వ్యూహాత్మక కార్యాచరణతో విపక్షాలు..

మునిసిపల్ ఎన్నికలలో సిపిఎం, జనసేన ను కలుపుకొని పోటీ చేసేందుకు  బీఆర్‌ఎస్ వ్యూహాలను రూపొందిస్తుంది. ఇప్పటికే ఆయా పార్టీల నేతలతో  జిల్లా నాయకత్వం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మరోవైపు సీపీఐ పార్టీని కూడా కలుపుకొని పోటీ చేసేందు కు  వ్యూహాత్మక కార్యాచరణతో సన్న ద్ధమవుతోంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో తమకు ఆదరణ బాగా ఉందని భావిస్తున్నా ఆయా పార్టీల  ఈ ఎన్నికల్లో మెజా రిటీ సీట్లు గెలుచుకునే దిశగా అంతర్గత కసరత్తు చేపట్టారు. సిపి ఐ పార్టీ తమతో కలిసి వస్తే  మున్సిపల్ ఎన్నికలలో  తమకు ఎదురులేదని విప క్షాలు భావిస్తున్నాయి.

ప్రభుత్వ వ్యతిరేకతపై బీఆర్‌ఎస్ ఆశలు..

అధికార కాంగ్స్రెపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందని, అందుకు ఇటీ వల జరిగిన పంచాయతీ ఎన్నికలే నిదర్శమని బీఆర్‌ఎస్ నేతలు అంటు  న్నారు. పంచాయతీల్లో తాము 27 శాతం గెలుచుకున్నామని, అదే ఊపుతో పుర పోరులో ఇంకా ఎక్కువ స్థానాలు గెలుచుకుంటామని చెబుతున్నారు. ఏది ఏమైనా అన్ని పార్టీలు  మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకొని పోరుకు సన్నద్ధ మవుతున్నాయి.