14 March, 2026 | 1:00 AM

శ్రీవిద్య పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

13-03-2026 10:47 PM

పాపన్నపేట: మండల కేంద్రమైన పాపన్నపేటలోని శ్రీవిద్య పాఠశాలలో శుక్రవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. కలెక్టర్ గా  శివాని, డీఈవో సునయన, ఎంఈఓ హర్షిత్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులుగా శ్రీనాథ్, ఉపాధ్యాయులుగా పలువురు విద్యార్థులు వ్యవహరించారు. బోధనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ రవీందర్ గుప్తా, కరస్పాండెంట్ సుమన్, నిటలాక్షప్ప బహుమతులు అందజేశారు.