ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లో రైతులు సభ్యత్వం తీసుకోవాలి
నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): తాండూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్న రైతులందరూ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలని అక్కంపల్లి సర్పంచ్ గుండారం వెంకాగౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని తాండూర్ కిచన్నపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని రైతులతో అక్కంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంస్థ వారు సర్పంచ్ వెంకాగౌడ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ మార్కెటింగ్ కమిటీ ఎక్స్ పర్ట్ ఆలీ హుస్సేన్ అవగాహన కల్పించారు.భూమిపట్టా ఉన్న రైతులు 2 వేల రూపాయలు సభ్యత్వం చెల్లించి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ లో భాగస్వామిగా చేరవచ్చన్నారు. ఎఫ్ పివో లో చేరిన రైతులందరికీ లబ్ధి చేకూరుతుందని అన్నారు. రాష్ట్రంలో 311 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంస్థలు మంజూరయ్యాయని, అందులో నాగిరెడ్డిపేట్ మండలంలో తాండూర్ సొసైటీకి ఒకటి మంజూరు అయ్యిందన్నారు.
ఈ ఆర్గనైజేషన్ లో 750 మంది సభ్యులు సభ్యత్వం ఉండి, ప్రతి సభ్యుడు రెండు వేల రూపాయలు చెల్లించినట్లయితే మొత్తం 15 లక్షల రూపాయలు జమవుతాయి అందుకు కేంద్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు చెల్లించి ఆర్గనైజేషన్ లో సభ్యత్వం ఉన్న సామాజిక భాగస్వాములకు లాభం వచ్చే వ్యాపారాలు చేసుకోవచ్చని సూచించారు. ఇలా వచ్చిన లాభంలో సభ్యత్వం కలిగి ఉన్న సభ్యులకు 60% వాటా పట్టుకుని 40% సభ్యులకు చెల్లిస్తారని ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అక్కంపల్లి గ్రామ సర్పంచ్ గుండారం వెంకగౌడ్, ఉప సర్పంచ్ కొత్తపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బండ లక్ష్మి బాబు మెంబర్లు జక్కుల రాములు, మాజీ మెంబర్లు, రైతులు దండు అంజయ్య యాటకారి రవి,దండు పరమేష్ బండ నాగయ్య కుమ్మరి శీను ,ప్రాథమిక వ్యవసాయ సహకార సిబ్బంది లక్నవరం రాములు,పారిపల్లి రాములు, మనిగిరి బీరప్ప, మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ ఆలీ హుస్సేన్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




