10 June, 2026 | 1:28 AM

అనుమాన పక్షి ఫన్ రైడ్

10-06-2026 12:00 AM

‘డీజే టిల్లు’తో సంచలన విజయాన్ని అందుకున్న రచయిత -దర్శకుడు విమల్ కృష్ణ ఇప్పుడు మరో విభిన్నమైన వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తు న్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఆ చిత్రమే ‘అనుమాన పక్షి’. రాజీవ్ చిలక, రాజేశ్ జగతియాని, హీరాచంద్ దండ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ యునిక్ కామెడీ చిత్రంలో యంగ్ హీరో రాగ్ మయూర్ కథానాయకుడు కాగా, ఆయన సరసన మెరిన్ ఫిలిప్ కథానాయికగా జత కట్టింది.

ప్రిన్స్ సిసిల్, అన్నయ్య, చరిత్, బ్రహ్మాజీ, రాసి, అజయ్, మస్త్ అలీ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో రాగ్ మయూర్ పోషించిన పాత్రను పరిచయం చేశారు. జూలై 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీ తం: శ్రీచరణ్ పాకాల; డీవోపీ: సునీల్‌కుమార్ నామా; ఆర్ట్: జేకే మూర్తి; ఎడిటర్: ఛోటా కే ప్రసాద్.