3 June, 2026 | 1:34 PM

గుర్రం వెంకటరెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

03-06-2026 12:46 PM

నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హుజూర్ నగర్, జూన్ 3: గరిడేపల్లి మండల పరిధిలోని గానుగబండ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ గుర్రం వెంకట రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని రాష్ట్ర నీటి పారుదల,పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... గుర్రం వెంకటరెడ్డి విద్యాకమిటి చైర్మన్ గా, ఎంపీటీసీగా పనిచేశారన్నారు. గానుగబండ గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి గ్రామ,మండల స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించారని,వారి సేవలు మరువలేనివన్నారు.వెంకటరెడ్డి మృతి అత్యంత బాధాకరమని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి,సంతాపం తెలిపారు.వారి కుటుంబానికి ఎల్లపుడూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బుధవారం ఒక ప్రకటనలో మంత్రి ఉత్తమ్ తెలిపారు.