కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ కవిత
29-08-2024 02:17 PM
హైదరాబాద్: అక్రమ నిర్బంధం నుంచి బయటకొచ్చిన బిడ్డను చూసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కండ్లల్లో ఆత్మీయ ఆనందం కనిపిస్తోంది. ఎర్రవెల్లి నివాసంలో తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఎమ్మెల్సీ కవిత కలిశారు. భర్త, కుమారునితో కలిసి వచ్చిన ఆడబిడ్డకు ఆత్మీయ ఆహ్వానం పలికారు కేసీఆర్. కవితను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని కేసీఆర్ ఆశీర్వదించారు. కన్న బిడ్డను చూడగానే తండ్రి కేసీఆర్ భోవోద్వేగానికి గురయ్యారు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ శ్రేణులు కవితకు ఘనస్వాగతం పలికారు. జైలు నుంచి వచ్చాక కవిత తొలిసారి కేసీఆర్ ను కలిశారు. 10 రోజుల పాటు కవిత ఫామ్ హౌస్ లోనే ఉంటనున్నట్లు సమాచారం.






