దేశ సమగ్రతలో పటేల్‌ది చారిత్రాత్మక పాత్ర
- భారతావని నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
- ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మహోత్సవాలు
హైదరాబాద్, మే 31(విజయక్రాంతి): ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్’ కార్యక్రమంలో భాగంగా నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఆదివారం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు దేశ సమ గ్రతలో సర్దార్ పటేల్ పోషించిన చారిత్రాత్మ క పాత్రను స్మరించుకున్నారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంలో సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, దూరదృష్టి కీలక పాత్ర పోషించాయి. నాటి నిజాం పాలనలో హైదరాబాద్‌ను భారత్ నుంచి వేరు చేయ డానికి లేదా పాకిస్థాన్‌లో విలీనం చేయడాని కి జరిగిన ప్రయత్నాలను తనదైన వ్యూహంతో సర్దార్‌పటేల్ తిప్పికొ ట్టారు. నేడు మనం అనుభవిస్తున్న సమైక్య భారతం ఆయన వేసిన పునాది ఫలితమేన న్నారు.
అంతేకా కుండా స్వాతంత్య్ర సమర యోధుల త్యాగాల ను గుర్తుచేసుకుంటూ, వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్య త నేటి యువతపై ఉందని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. దేశఐక్యతను, సమగ్ర తను, సామాజిక సామరస్యాన్ని కాపాడుకుం టూ, అభివృద్ధి చెందిన భారతావని నిర్మా ణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. మహనీయుల ఆశయ సాధన దిశగా పయనించడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు.






