1 June, 2026 | 2:46 AM

రైలు ఢీకొని ఇద్దరు మహిళల మృతి

01-06-2026 01:02 AM

నందిగామ వద్ద ఘటన 

షాద్‌నగర్ టౌన్, మే31(విజయక్రాంతి): రైలు ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బీహార్ రాష్ట్రానికి చెందిన ప్రీతి(22), చున్మన్ కుమారి (15)లు అయ్యప్ప గుడి వద్ద నివసిస్తున్నారు. వంట కర్రల కోసం వెళ్లిన ఇద్దరు రైలు పట్టాలు దాటుతుండగా హైదరాబాద్ నుంచి కర్నూలు కు హంద్రీ ఎక్స్‌ప్రెస్ డౌన్ లైన్‌లో వెళ్తుండగా, గూడ్స్ రైలు అప్ లైన్ వెళ్తుండగా వారిని ఒకే సారి ఢీకొన్నాయి.లోకో పైలెట్ శ్రీనివాస్ సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు 108 సహాయంతో షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. లోకో పైలెట్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.