4 March, 2026 | 6:19 PM

పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి

04-03-2026 05:15 PM

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ఆలేరు,(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే  పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లడుతూ... ఆసుపత్రిలోని ఎన్ని విభాగాలు ఉన్నాయి. ఎంత మంది డాక్టర్ లు, సిబ్బంది ఉన్నారని సంబంధిత అధికారులను అడిగి, ప్రతిరోజు సగటున  ఎంతమంది ఇన్ పేషెంట్ గా అడ్మిట్ అవుతున్నారని  తెలుసు కున్నారు.

ఆసుపత్రిలో ఉన్న వార్డు లను కలియ తిరిగి, ఇన్ పేషెంట్ తో కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారా, మంచి ఆహారం పెడుతున్నారా అని ఆరా తీశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. అవసరమైన ఔషధాలు అన్ని అందుబాటులో ఉన్నాయని ఆరా తీశారు. గడువు ముగిసిన మందులను చెక్ చేయాలన్నారు. పేషెంట్లకు మందులు ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసి, పేషంట్లకి అవసరమైన అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు  వివిధ రకాల టెస్టులను  ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయాలన్నారు.

గర్భిణీ స్త్రీలకు  మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెంచాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించి, సమయ పాలన పాటించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వైద్యులు, సిబ్బంది అందరూ అంకితభావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. జీజీహెచ్ లో నిర్మాణంలో అదనపు గదుల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించి, నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేసి, అవసరమైన ఫర్నిచర్ కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు, ఈ కార్యక్రమం లో కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపర్డెంట్ పాండు నాయక్, డాక్టర్స్ సిబ్బంది, సంబంధిత  అధికారులు పాల్గొన్నారు.