కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి
మంథని బిజెపి మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బోయిని నారాయణ డిమాండ్
మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు లోని శ్రీరామ్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని బిజెపి పార్టీ మంథని మాజీ మండల అధ్యక్షుడు బోయిని నారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులను బుధవారం రామాలయం వద్ద విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరామ్ నగర్ లోని రామాలయం లో ప్రతి సంవత్సరం గ్రామ ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.
కానీ సీతరాములు మహోత్సవం కార్యక్రమానికి ఆలయం వద్ద స్థాలం సరిపోవడం లేదని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఎస్ఆర్ఎస్పి కాలువ పైన సిమెంట్ తో ఫ్లోరింగ్ పనులు చేయిస్తామని మున్సిపల్ ఎన్నికల ముందు శ్రీరామ్ నగర్ గ్రామ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు హామి ఇచ్చారని, హామిని వెంటనే నిలబెట్టుకోవాలని శ్రీరామ్ నగర్ గ్రామ ప్రజలందరి తరఫున కోరుతున్నానని నారాయణ అన్నారు.
త్వరలోనే శ్రీరామనవమి కల్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మంథని మున్సిపల్ పరిధిలోనే అత్యంత అంగరంగ వైభవంగా ఎక్కడ లేని విధంగా జరుపుకుంటారని, భక్తుల సౌకర్యార్థం శ్రీరామనవమిని పురస్కరించుకొని, వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని నారాయణ కాంగ్రెస్ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు.




