calender_icon.png 19 October, 2025 | 10:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మండల పంచాయతీ అధికారిగా ఎంపికైన పవన్ కు సన్మానం..

19-10-2025 06:48:11 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని స్వప్న కాలానికి చెందిన పిట్టల  పద్మ - సాగర్ దంపతుల కుమారుడు పవన్ కుమార్ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో 327 ర్యాంకు సాధించి, శనివారం హైదరాబాదులోని శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా మండల పంచాయతీ అధికారిగా నియామక పత్రం అందుకున్నా  పవన్ ను ఆదివారం కాలనీవాసులు ఘనంగా సన్మానించారు.

గత ఆరు నెలల క్రితం ప్రభుత్వ విడుదల చేసిన గ్రూప్-4 పరీక్షలలో ఎంపికై పెద్దపల్లి కమర్షియల్ టాక్స్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్న పవన్ ఎంపిక పట్ల కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ పవన్ ను మహిళలు మిఠాయిలు తినిపించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు అమిరిశెట్టి తిరుపతి, కాలనీ మహిళలు రాజేశ్వరి, రమాదేవి ,శ్వేత,శారద,మౌనిక, మేఘమాల, రాధా మనిషా, రమ్య, సుజాత తదితర మహిళలు పాల్గొన్నారు.