ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం
12-06-2024 11:58 AM
అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను.. అనగానే అభిమానుల కేరింతలతో సభ ప్రాంగణం అంత మార్మోగింది. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వేదికపైనే అన్న మెగాస్టార్ చిరంజీవి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఒక పక్కన తన తమ్ముడు ప్రమాణ స్వీకారం చేస్తుంటే చిరంజీవి ఆనందంతో ఉప్పొంగిపోయారు.






