22 April, 2026 | 1:34 AM

ఆర్టీసీ సమ్మెకు టీఆర్పీ సంపూర్ణ మద్దతు

22-04-2026 12:00 AM

జిల్లా అధ్యక్షులు రవి పటేల్ 

జయశంకర్ భూపాలపల్లి (మహబూబా బాద్) ఏప్రిల్ 21 విజయ క్రాంతి): తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి నిర్వహించ తలపెట్టిన ఆర్టీసీ సమ్మెకు తెలంగాణా రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు మద్దతు తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సమ్మెలో పాల్గొంటామని రవి పటేల్ తెలిపారు.

విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో టీఆర్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఇనుగాల ప్రణయ్, రాజ్, మోటపోతుల సమ్మయ్య, కౌటం సురేందర్, స్వామి పాల్గొన్నారు.