11 March, 2026 | 8:19 AM

పీడీఎస్ బియ్యం పట్టివేత

11-03-2026 12:55 AM

ముగ్పాల్ మార్చి 10(విజయక్రాంతి): నిజామాబాద్ రూరల్ ముగ్పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిడిఎస్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మార్చి 8న కాల్పోల్ గ్రామానికి చెందిన రుడావత కృష్ణ, బస్సి రంజిత్ తమ తమ వాహనాల్లో పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా మోపాల్ పోలీసులు పట్టుకున్నారు.

అనంతరం డీటీ సివిల్ సప్లైస్ అధికారులు పంచనామా నిర్వహించి ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర సుస్మిత  ప్రకటనలో తెలిపారు. స్వాధీనం చేసుకున్న బియ్యం వరుసగా 33 క్వింటాళ్లు, 38 క్వింటాళ్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.