11 June, 2026 | 5:10 PM

Breaking News

ప్రశాంతంగా ఎన్నికలు

12-02-2026 02:03 AM

మహబూబ్ నగర్ టౌన్, ఫిబ్రవరి 11 : జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ కంట్రోల్ రూమ్ ద్వారా రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్,దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీ కి జరిగిన పోలింగ్ ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి,సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి తో కలిసి పరిశీలించారు.

ఉదయం నుండి మహబూబ్ నగర్ కార్పొరేషన్, దేవరకద్ర మున్సిపాలిటీ,భూత్పూర్ మున్సిపా లిటీ లలో పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ విజయేందిర బోయి,సాధారణ ఎన్నికల పరిశీలకురాలు కాత్యాయని దేవి,ఐ.ఏ.ఎస్ లు సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించి  అధికారులకుపలు సూచనలు చేశారు. మహబూబాబాద్ నగర్ కార్పొరేషన్ లో 84.58, దేవరకద్రలో  85.51, భూత్పూర్ లో 67.73 శాతం పోలింగ్ కావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు ముగిశాయి.