సీఎంను కలిసిన పెద్దపల్లి ఎంపీ
07-06-2024 12:43 AM
పెద్దపల్లి (మంథని), జూన్ 6 (విజయక్రాంతి): పెద్దపల్లి ఎంపీగా గెలిచిన గడ్డం వంశీకృష్ణ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం హైదరా బాద్‌లో కుటుంబ సభ్యులతో కలిసి సీఎంని కలిశారు. తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, తల్లితో కలిసి సీఎంను శాలువాతో సన్మానించారు. చిన్న వయసులో ఎంపీగా గెలిచిన వంశీకృష్ణను సీఎం అభినందించారు.






